
రిజర్వు ఫారెస్టులో రోడ్డు వేసి అక్రమ రవాణా
చిట్టమూరు : మండలానికి తాగు, సాగునీరు సరఫరా అయ్యే తెలుగు గంగ 7వ బ్రాంచి కాలువ కరకట్టను కూటమి నేతలు తమ ధనార్జన కోసం తొలిచి రోడ్డు నిర్మించి టిప్పర్లతో గ్రావెల్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. యాకసిరి పంచాయతీ పరిధలోని రావిగుంట చెరువులో కూటమి నేతలు హిటాచీతో టిప్పర్లకు గ్రావెల్ నింపి తరలిస్తున్నారు. దీంతో తెలుగు గంగ కాలువలు ధ్వంసం అవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నేతలు బరితెగించి రిజర్వు ఫారెస్ట్‌లో గ్రావెల్ రోడ్డు వేసి అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించక పోవడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు.