
తీవ్రవాదిలా తీసుకుని వస్తారా?
చిల్లకూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని నె ల్లూరు నుంచి గూడూరు కోర్టులో హాజరుపరిచే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, కూట మి ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేసేందుకు ఆయన్ని తీవ్రవాదిని తీసుకుని వచ్చినట్లు తీసుకుని వస్తారా? అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రశ్నించారు. గూడూ రు రెండో పట్టణంలోని వైఎస్సార్‌సీపీ రూరల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధారమైన కేసు ల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి, పలు కోర్టులకు తిప్పుతున్నా రని విమర్శించారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసులు పీటీ వారెంట్ వేసి, గూడూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకుని వచ్చే క్రమంలో అప్పటికప్పుడు 144వ సెక్షన్‌ను అమలులోకి తీసుకుని రావడం, రెండో పట్టణంలోని కోర్టుకు మూడు వైపులా ఉన్న దుకాణా లు మూసి వేయడం, పోలీసుల మోహరింపు చూస్తుంటే ఎందుకంత భయమో అర్థం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌సీపీ నాయకులను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు బనాయించా రన్నారు. చట్ట సభలో చట్టాలను చేసే తమ లాంటి ప్ర తినిధులకు కూడా గూడూరు పోలీసులు అనుమతి ఇ వ్వకుండా కోర్టు ఆవరణలోకి వెళ్లనీయకుండా ఎండ లోనే గేటు బయట గంటల పాటు ఆపడం మంచి సంస్కృతి కాదని హితవు పలికారు. గతంలో బ్రిటీష్ పోలీసులు భారతీయులపై చేసిన తప్పిదాలను నేడు రాష్ట్ర పోలీసులు గుర్తు చేస్తున్నారని, దీంతోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో పలు రకాల ఆంక్షలు విధించడం దారుణమైన విషయమని అన్నారు. తనతో పాటుగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ మండల కార్యాలయంలో ఉంటే అ క్కడకు వచ్చి బయటకు వస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, కోట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్‌గౌడ్, యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్‌రెడ్డి, గూడూ రు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు గొట్టి పాటి రవీంద్రరెడ్డి, కామిరెడి కస్తూర్‌రెడ్డి, ఓడూరు బా లక్రిష్టారెడ్డి, బాబురెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, యల్లా శ్రీనివాసులరెడ్డి, సాయిరెడ్డి, దీప్తి పాల్గొన్నారు.
మాజీ మంత్రి కాకాణిని కోర్టు హాజరులో పోలీసుల అత్యుత్సాహం
శాసన మండలిలో ఫిర్యాదు చేస్తా
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్