ఎస్వీయూ సిగలో మరో ఆభరణం
తిరుపతి సిటీ: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్–పార్ట్నర్‌షిప్స్ ఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేతృత్వంలోని స్పోక్ సంస్థగా ఎస్వీయూ ఎంపికై ంది. అంతర్జాతీయస్థాయి పరిశోధనలకు బాటలు వేసే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ అందిపుచ్చుకుంది. వీసీ ప్రొఫెసర్ అప్పారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏఎన్‌ఆర్‌ఎఫ్–పీఏఐఆర్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల మధ్య పరస్పర సహకార పరిశోధనను ప్రోత్సహించేందుకు హబ్‌అండ్‌స్పోక్ మోడల్‌ను అమల్లోకి తెచ్చిందన్నారు. దేశంలోని 30 ప్రఖ్యాత సంస్థలు ఈ గ్రాంట్‌కు దరఖాస్తు చేయగా వాటిలో ఏడు ప్రధాన హబ్ సంస్థలు ఎంపికయ్యాయని తెలిపారు. అందులో ఎస్వీయూకు స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మధుమేహం, ఫ్యాటీ లివర్ వ్యాధి, డెంగీ, మలేరియా, బ్రెస్ట్, బ్లడ్ కాన్సర్ వంటి ప్రధాన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వర్సిటీ పరిశోధనలు చేస్తుందని అన్నారు. ఈసందర్భగా ప్రాజెక్ట్ బృందానికి వీసీ, రిజిస్ట్రార్ భూపతినాయుడు అభినందనలు తెలిపారు.


