
యువకుడి వేధింపులు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..
హైదరాబాద్: తనతో కలిసి ఉండకపోతే చంపేస్తానని ఓ యువతిని బెదిరించడమే గాక తరచూ ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తానికి గురైన బాధితురాలు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా, వట్టికం మన్‌పహాడ్ గ్రామానికి చెందిన బానోతు రంగమ్మ హౌస్‌కీపింగ్ పనిచేస్తూ శ్రీకృష్ణానగర్‌లో తన కుమార్తె రేణుక (20)తో కలిసి ఉంటోంది.
రేణుక సమీపంలోని ల్యాండ్ రిడ్జ్‌లో పని చేసేది. రెండేళ్ల క్రితం ఆమెకు చల్లా వినయ్‌కుమార్ అనే యువకుడితో పరిచయం కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే డ్రగ్స్‌కు అలవాటు పడిన వినయ్‌కుమార్ ఆవారాగా తిరుగుతూ రేణుక జీతాన్ని బలవంతంగా లాక్కునేవాడు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఈ నెల 9న రేణుక డ్యూటీకి వెళ్లింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో వినయ్‌కుమార్ రేణుక పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆమెతో పాటు అక్కడ పనిచేస్తున్న దివ్య అనే యువతిని కూడా బలవంతంగా లాక్కొచ్చి రేణుక స్కూటీ పైనే వారిని ఎక్కించుకుని వెళ్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
మద్యం మత్తులో ఉన్న వినయ్‌కుమార్ బైక్ నడుపుతుండడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన రేణుకను బైక్ విషయమై తల్లి ప్రశి్నంచగా రిపేర్‌కు ఇచ్చానని తల్లికి అబద్దం చెప్పింది.దీంతో మనస్తాపానికి లోనైన ఆమె ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి ఆత్మహత్యకు వినయ్‌కుమార్ కారణమని తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.