వివాహమైన నెలకే భార్య దూరమైందని ..... | Young Man Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

వివాహమైన నెలకే భార్య దూరమైందని .....

Feb 23 2025 8:16 AM | Updated on Feb 23 2025 8:16 AM

Young Man Ends Life In Hyderabad

సికింద్రాబాద్‌: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాదౌర గ్రామానికి చెందిన నీలేశ్‌ సింగ్‌ (25) తన సోదరుడు ముఖేశ్‌ సింగ్‌ ఇతర స్నేహితులతో కలిసి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. మేడ్చల్‌ ప్రాంతంలో ఉంటూ రాయల్‌పూర్‌ క్వారీలో టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. 

మేడ్చల్‌ ప్రాంతంలో వీరందరి పని పూర్తవడంతో కడపలోని క్వారీలో పని చూసుకున్నారు. æకడపకు వెళ్లేందుకు నీలేశ్‌ తన సోదరుడు ముఖేష్, మిత్రులతో కలిసి శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు టికెట్‌ తీసుకున్న వారంతా రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ హాలులో కూర్చున్నారు. అదే సమయంలో తన పాకెట్‌లోంచి సెల్‌ఫోన్, పర్సు తీసిన నీలేశ్‌ తన బ్యాగులో పెట్టి ఇప్పుడే వస్తానని సోదరుడికి చెప్పి బయటకు వెళ్లాడు. రైలు వచ్చే సమయం అవుతున్నా నీలేశ్‌ రాకపోవడంతో అతడి సోదరుడు, మిత్రులు స్టేషన్‌ అంతటా గాలించినా ఆచూకీ లభించలేదు. 

ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్‌ యార్డు సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు స్టేషన్‌ డిప్యూటీ మేనేజర్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో నీలేశ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలింది. ఇదిలా ఉండగా ఇటీవలే నీలేశ్‌కు వివాహం జరిగిందని, వ్యక్తిగత కారణాలతో నెల రోజుల కాపురం అనంతరం వారిద్దరు విడిపోయారని మృతుడి సోదరుడు ముఖేష్‌ పోలీసులకు వివరించాడు. అప్పటి నుంచి నీలేశ్‌ ముభావంగా ఉంటన్నాడని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నీలేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement