హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన | Union government makes key announcement on Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Apr 2 2026 7:52 PM | Updated on Apr 2 2026 8:10 PM

Union government makes key announcement on Hyderabad Metro Rail

ఢిల్లీ:  హైదరాబాద్‌ నగర మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదని, ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం,  సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపింది.  ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. 

‘2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై అప్రైజల్ జరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేస్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యసాధ్యల పై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు  ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement