టీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో మంటలు | TSRTC Luxury Bus Burnt In Fire At Mahbubnagar | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Jun 27 2022 7:40 AM | Updated on Jun 27 2022 7:48 AM

TSRTC Luxury Bus Burnt In Fire At Mahbubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌ నగర్‌: టీఎస్‌ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తతో 16 మంది ప్రాణాలను కాపాడాడు. వివరాల ప్రకారం.. బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై దగ్ధమైన హైదరాబాద్‌ డిపో-1కు చెందిన టీఎస్‌ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం అర్దరాత్రి మంటల్లో కాలిపోయింది. 

కర్నూలు నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన లగ్జరీ బస్సు మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన డ్రైవర్‌.. బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప‍్రయాణికులకు ముప్పు తప్పింది. అయితే, షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బస్సు అగ్ని ప‍్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే.. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. 

ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది 

Advertisement
 
Advertisement
Advertisement