
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలను ఈనెల 24న 11 గంటలకు వెల్లడిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఫలితాలు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను వేగంగా తెలుసుకునేందుకు ‘సాక్షి’దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation. com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది.