మీ నేతల అక్రమాలపై చర్యలు తీసుకోరా?: రేవంత్‌ | TRS Ministers MLAs Brazenly Encroaching Lands: Revanth Reddy | Sakshi
Sakshi News home page

మీ నేతల అక్రమాలపై చర్యలు తీసుకోరా?: రేవంత్‌

Feb 8 2022 3:58 AM | Updated on Feb 8 2022 9:05 AM

TRS Ministers MLAs Brazenly Encroaching Lands: Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని ఏ డివిజన్‌కు, ఏ నియోజకవర్గానికి వెళ్లినా టీఆర్‌ఎస్‌ నేతల అక్రమ నిర్మా ణాలే కనిపిస్తున్నాయి. తమను ప్రజలు గెలిపిం చిందే దోచుకోవడం, దాచుకోవడం, భూకబ్జా లకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేసి సొమ్ము చేసుకోవడమని మీ పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన మీరే అక్రమ నిర్మాణాలు కలిగి ఉండి వారికి ఆదర్శంగా మారారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోండి.

లేదంటే కాంగ్రెస్‌ పక్షాన క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధ మవుతాం’ అని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌ రెడ్డి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సోమవారం రాసిన ఈ బహి రంగ లేఖతోపాటు ఆధారాలనూ జతచేశారు. ‘జవహర్‌నగర్‌ 488 సర్వే నంబర్‌లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమంగా ఆస్పత్రి కట్టి మరో మంత్రి దీన్ని ప్రారంభించారు. ఫిర్జాదీగూడలో టీఆర్‌ ఎస్‌ నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫంక్షన్‌ హాల్‌ కట్టారు.

గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు పక్కన మంత్రి బంధువుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఖరీదైన విల్లాలు నిర్మించింది. ఇలాంటి ఘట నలు గ్రేటర్‌లో కోకొల్లలు. వీటిపై స్పందించి మున్సిపల్‌ మంత్రిగా చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఈ చర్యలకు పూనుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతాం’ అని కేటీఆర్‌కు రాసిన లేఖలో రేవంత్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement