TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. 21 డిమాండ్లతో నోటీసులు | TGSRTC Employees Strike Over 21 Demands | Sakshi
Sakshi News home page

TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్‌.. 21 డిమాండ్లతో నోటీసులు

Jan 27 2025 4:56 PM | Updated on Jan 27 2025 6:55 PM

TGSRTC Employees Strike Over 21 Demands

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.

కాగా, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్‌ మోగింది. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్‌సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఇక, 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.     

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్

Advertisement
 
Advertisement
Advertisement