
కర్ణాటక తర్వాత మన రాష్ట్రంలోనే అత్యధిక కేసులు
తెలంగాణ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన హత్య కేసులు
సైబర్ నేరాల నమోదులో రెండో స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : సైబర్‌నేరాల నమోదులో తెలంగాణ జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2023లో కేసుల సంఖ్య 18,236కి చేరినట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2023 నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల నమోదులో దేశవ్యాప్తంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది.

⇒ తెలంగాణ వ్యాప్తంగా హత్య కేసులు సైతం స్వల్పంగా పెరిగాయి. 2022లో 937 హత్య కేసులు నమోదు కాగా..2023లో 954 కేసులు నమోదైనట్టు గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక నేరాల్లోనూ తెలంగాణ జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 2022లో 26,321 కేసులు, 2023లో 26,881 కేసులు నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.