సాక్షి, హైదరాబాద్: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎస్‌ఆర్‌వోలలో 22ఏ లిస్ట్ డిస్‌ప్లే చేయాలని నిర్ణయించింది. వచ్చే వారం రోజుల లోపు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో 22A లిస్ట్‌ను ప్రభుత్వం డిస్‌ప్లే చేయనుంది. 22Aలో 3లక్షల 73వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.
గడిచిన రెండు రోజుల్లో 25కి పైగా 22A రిజిస్ట్రేషన్లు జరగ్గా, 22A సమస్య ఉన్నా రిజిస్ట్రేషన్లు ఆగడం లేదని అధికారులు అంటున్నారు. ప్రతీ రోజు వ్యవసాయం 2500 రిజిస్ట్రేషన్లు.. నాన్ అగ్రికల్చర్ 4500 పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సమాచారం. 22A పై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు ప్రకటించింది.


