దళిత బంధు ఘనత సీఎందే: గజ్జెల కాంతం   | Telangana: Gajjala Kantam Comments Over CM KCR | Sakshi
Sakshi News home page

దళిత బంధు ఘనత సీఎందే: గజ్జెల కాంతం  

Oct 11 2021 4:53 AM | Updated on Oct 11 2021 4:53 AM

Telangana: Gajjala Kantam Comments Over CM KCR - Sakshi

ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ దళితబంధు తీసుకువచ్చినందుకు దళిత, గిరిజన సంఘాలు రుణపడి ఉంటాయని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ, తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం, దళిత కులాల సంఘాల అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడారు. అంబేడ్కర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని, ప్రతిపక్షాలు దళితబంధు పథకాన్ని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ దళితులకు ఏం చేసిందో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చెప్పాలని పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి అన్ని జిల్లాల్లో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞలు చేయించడంతో పాటు బీజేపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. దళితబంధులాగే గిరిజన, బీసీబంధు అమలు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement