మాజీ డీజీపీ శివధర్‌ రెడ్డికి కీలక బాధ్యతలు | Telangana EX DGP Shivadhar Reddy Appointed As State Security Advisor, VH Gets BC Welfare Role | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీ శివధర్‌ రెడ్డికి కీలక బాధ్యతలు

Apr 30 2026 12:08 PM | Updated on Apr 30 2026 1:04 PM

Telangana EX DGP Shivadhar Reddy Appointed As SSA

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీ శివధర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ వి. హనుమంత రావుకు రేవంత్‌ ప్రభుత్వం కీలక పదవులను అప్పగించింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా హనుమంత రావును, తెలంగాణ స్టేట్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా మాజీ డీజీపీ శివధర్‌ రెడ్డిని నియమించింది. ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది.  

ఈ నేపథ్యంలో శివధర్‌ రెడ్డి.. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర భద్రతా సలహాదారుగా సేవలు అందించనున్నారు. చట్టం, శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై ప్రభుత్వానికి శివధర్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు చీఫ్ సెక్రటరీ హోదాతో పాటు నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement