
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జ రగనున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండా లని పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణపై పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
అభ్యర్థుల గెలుపోటముల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలతో పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యా లీల సందర్భంగా దాడులు, ప్రతిదాడులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించారని, మరో రెండురోజులు ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ కోరారు.