
సాక్షి, హైదరాబాద్: సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. సంజయ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నట్టు సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు పంపించారు. సీఎం కేసీఆర్ శుభాకాంక్షలకు సంజయ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.