నేడు మంత్రివర్గ సమావేశం!   | Telangana Cabinet meeting on february 9th | Sakshi
Sakshi News home page

నేడు మంత్రివర్గ సమావేశం!  

Feb 9 2024 2:13 AM | Updated on Feb 9 2024 2:13 AM

Telangana Cabinet meeting on february 9th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు సమాచారం. శాసనసభ, మండలిలో శనివారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. శుక్రవారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందాక.. మంత్రివర్గ సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement