విధ్వంసకాండ రాష్ట్ర సర్కార్‌ వైఫల్యం 

Telangana BJP Chief Bandi Sanjay Comments On Govt Over Secunderabad Protest Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, కామారెడ్డి/భిక్కనూరు: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండను పసిగట్టడం, నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘వేల మంది స్టేషన్‌ దగ్గర గుమిగూడుతుంటే.. రాష్ట్ర ఇంటె లిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది’అని శుక్రవారం ఆయన ఒక ప్రకట నలో ప్రశ్నించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్య తగా వ్యవహరించాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దుర్మా ర్గం’ అని మండిపడ్డారు.

రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండ ఆవేశపూరిత చర్య కాదని, ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని స్పష్టమవుతోం దని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసు స్టేషన్‌ ఆవరణలో సంజయ్‌ విలేకరులతో మాటాడారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను శుక్రవారం భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్టు చేశారు.  తరువాత సిరి సిల్లా జిల్లా పోతుగల్‌ గ్రామంలో ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లాలని బండి సంజయ్‌ కోరడంతో పోలీసులు ఆయనకు ఎస్కార్ట్‌ ఇచ్చి పంపించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top