మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

మల్లారెడ్డి VS అడ్లూరి: సుచిత్ర భూవివాదంలో ట్విస్ట్‌

Published Mon, May 20 2024 3:15 PM

Survey Completed At Malla Reddy land Dispute At suchitra

హైదరాబాద్‌, సాక్షి: సుచిత్రం భూవివాదంలో ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు, తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన భూమిని ఆక్రమించారని మల్లారెడ్డి వాదిస్తుండగా, మరోవైపు ఆ భూమి తమ 15 మందిదేనని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ వాదిస్తున్నారు.

సుచిత్రలోని సర్వే  నెంబర్‌ 82లో ఉన్న భూమి కోసం వివాదం కొనసాగుతోంది. తమ అనుచరులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఆ స్థలంలో పాతిన ఫెన్సింగ్‌, బారికేడ్లను తొలగించే యత్నం చేశారు. ఇంకోవైపు అక్కడికి చేరుకున్న 15 మంది ఆ స్థలం తమదేనని వాదించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పబోయిన పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన్ని అరెస్ట్‌ చేసి పేట్‌ బషీర్‌బాద్‌ పీఎస్‌కు తరలించారు.  

పోలీసుల జోక్యంతో.. రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో సర్వే చేపట్టారు. తాజాగా వివాదాస్పద భూమిపై సర్వే పూర్తైంది. యితే పోలీసులకు సర్వే రిపోర్ట్‌ ఇస్తారని భావించగా.. బదులుగా కలెక్టర్‌కు రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించబోతున్నారని తెలుస్తోంది. దీంతో స్థల వివాదానికి ఎలాంటి ముగింపు దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement