విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం 

Students Need Understanding Of Law Says Vice Principal Dr. D. Radhika Yadav Hyderabad - Sakshi

కాచిగూడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లా వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.రాధిక యాదవ్‌ అన్నారు. కాచిగూడలోని ఎంఎస్‌ఎస్‌ లా కాలేజీలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ విష్ణుప్రియ అధ్యక్షతన లా విద్యార్థులకు ఇండక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో న్యాయ విద్య ఒక ఉన్నతమైన వృత్తి అన్నారు.

ప్రస్తుత సామాజిక మార్పులతో విద్యార్థులు చర్చలకు హాజరు కావడం, భాషపై పట్టు సాధించడం, ఆన్‌లైన్‌లో చట్టపరమైన వనరులను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు, జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎస్‌ లా కాలేజ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డీవీజీ కృష్ణ, కార్యదర్శి ఎస్‌.బి.కాబ్రా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top