మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట | Relief For Telangana Government In Musi Cleansing Case | Sakshi
Sakshi News home page

మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్‌కు భారీ ఊరట

Apr 2 2026 12:57 PM | Updated on Apr 2 2026 1:05 PM

Relief For Telangana Government In Musi Cleansing Case

సాక్షి, హైదరాబాద్‌: మూసీ ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) కీలక తీర్పునిచ్చింది. మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన ఎన్‌జీటీ.. ప్రక్షాళనపై పటోళ్ల కార్తీక్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

గాంధీ సరోవర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్‌ పేర్కొన్నగా.. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారన్నది ప్రభుత్వం వాదన. విచారణ జరిపిన ఎన్‌జీటీ.. పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేసును ట్రిబ్యునల్‌ డిస్మిస్ చేయడంతో మూసీ ప్రక్షాళన పనులకు లైన్‌ క్లియర్ అయ్యింది. ఈ తీర్పుతో ప్రభుత్వానికి లీగల్ రిలీఫ్ లభించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement