పశ్చిమాసియాలో యుద్ధం జరిగిందన్న విషయం తెలిసిందే. దానివల్ల నిన్నటివరకు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దాని ప్రభావం వల‍్ల భారతదేశంలోని చాలా వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్ బ్యాగ్స్. మనం మార్కెట్ నుంచి ఎన్నో వస్తువులను తీసుకెళ‍్లడానికి వాడుతుంటాము. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ధర కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. ఈ విషయంపై మరిన్ని వివరాలను ‘సాక్షి’కి వివరించారు మాన్ సరోవర్ అగ్రోసాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని భగవంత్ పన్సారి.
ఇప్పుడు ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఎన్నడూలేనంత రేట్ ఉంది. ఇలా పెరగడానికి కారణాలు ఉన్నాయి. ఇది క్రూడాయిల్‌కు సంబంధించిన ప్రొడక్ట్. రైస్ మిల్స్, ఫ్లోర్ మిల్స్, సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నింట్లో ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉంది. వేరే ప్యాకింగ్ ఏది లేదు. అన్నింట్లోనూ ప్లాస్టిక్ ఉంది. మీరు గుట్కా తీసుకుంటే కూడా, నీళ్ల పాకెట్ తీసుకుంటే కూడా ప్లాస్టికే. ప్లాస్టిక్ యూసేజ్ ఇంకా పెరుగుతుంది. మాకే దానా దొరకడంలేదు. మాకు రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోని టై అప్ ఉంది. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి మేము ట్రేడ్ లో ఉన్నాం.
ఇక ప్రజలు ఏం చేస్తారు? ఏ రేట్ ఉన్నా వాళ్లకు బ్యాగ్ కావాల్సిందే. 10 రూపాయల బ్యాగును మేము 18 రూపాయలకు అమ్ముతున్నాం ఇప్పుడు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. వచ్చేనెల సమస్య ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ ప్లాస్టిక్ బ్యాగులు తక్కువనే ఉత్పత్తి అవుతున్నాయి.
డైలీ 3-4 లక్షలు అమ్మేవాళ్లం. 1,50,000కి వచ్చేశాం. సమీప భవిష్యత్తులో లక్ష బ్యాగులు కూడా ఇవ్వలేము. రా మెటీరియల్ మనకు దొరకదు. మన ఫ్యాక్టరీలు నడవవు. ఫ్యాక్టరీలు నడవకుంటే మనం సప్లై చేయలేము. పెట్రోల్ లేకుంటే బండి నడవదుకదా? పాల పాకెట్ కూడా ప్లాస్టిక్ ఉంటేనే మీ ఇంటికి చేరుతుంది. ప్లాస్టిక్ కొరత ఇంకా పెరుగుతుందన్న సమాచారం మా వద్ద ఉంది. మాల్ చాలా షార్టేజ్ ఉంది’ అని తెలిపారు.
గోనె సంచులకు డిమాండ్ ఎందుకు తగ్గింది?
ప్రస్తుతం గన్ని బ్యాగ్స్ (గోనె సంచులు)కు డిమాండ్ చాలా తక్కువగా ఉంది. వీటిని కేవలం వరి పండించిన తర్వాత ఆ వడ్ల కోసం మాత్రమే వాడుతున్నారు. ఇంకా దేనికీ వాడట్లేదు. గతంలో బియ్యానికి కూడా గోనె సంచులు వాడేవారు. కానీ ఈ కాలంలో బియ్యానికి కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతున్నారు. అసలు గోనె సంచులకు ఎందుకు డిమాండ్ తగ్గింది? గన్నీ బ్యాగ్స్ బిజినెస్ చేసే మధు సురేష్ వివరాలు తెలిపారు.
‘నేను 40 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాను. డిమాండ్ ఎందుకు తగ్గిందంటే ప్రాపర్‌గా జూట్ దొరకట్లేదు ఒకటి. ఆ జూట్‌ను ప్రొడక్షన్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇస్తే దాని గురించి ఎంతో మంది ఫార్మర్స్ ప్రొడక్షన్ చేస్తారు. రిలయన్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతో టై అప్ అయిపోయి జూట్‌ను బంద్ చేసేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ తో ఏమవుతుంది? మొత్తం ప్లాస్టిక్ అంతా వేడి వస్తుంది. అంత కవర్ వేస్తారు.. దానివల్ల క్యాన్సర్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని పట్టించుకోవట్లేదు’ అని చెప్పారు. -వెబ్‌డెస్క్
పూర్తి వివరాలు


