
రాజన్న సిరిసిల్ల జిల్లా: బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ చానళ్ల వల్ల మొత్తం జర్నలిజం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందన్నారు. ఈరోజు(సోమవారం) వేములవాడలో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడారు. ‘ సమాజ మార్పుకు కృషి చేసే యూట్యూబ్ చానళ్లను ప్రోత్సహించి, బ్లాక్ మెయిలింగ్ యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. త్వరలో ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తా.
రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్బరం. కాంగ్రెస్ పాలనో జర్నలిస్టుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయ్యింది. బీజేపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకుంటాం. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఈ ఏడాది నిధులు తీసుకొస్తా. కరీంనగర్ అభివృద్ధికి మొండి పట్టుదలతో పని చేస్తున్నా. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు యత్నిస్తున్నా’ అని బండి సంజయ్ తెలిపారు.