రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు కరోనా | MLA Korukanti Chander tests corona positive | Sakshi
Sakshi News home page

రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు కరోనా

Aug 3 2020 4:20 PM | Updated on Aug 3 2020 4:43 PM

MLA Korukanti Chander tests corona positive - Sakshi

సాక్షి, పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా సోకింది. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న కోరుకంటి చందర్‌, రామగుండం మేయర్‌ డా. అనిల్‌లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గత వారం రోజులుగా మేయర్ హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యే చందర్ కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. (ప్రముఖులపై కరోనా పంజా)

ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పటాన్ చెరూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తాతో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడి కోలుకున్నారు.(కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement