బాలికపై అత్యాచారం | MIinor girl incident In Hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Nov 9 2025 9:56 AM | Updated on Nov 9 2025 9:56 AM

MIinor girl incident In Hyderabad

ఇబ్రహీంపట్నం రూరల్‌: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఆదిబట్ల పీఎస్‌లో శనివారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నాదర్‌గుల్‌లో నివాసం ఉండే బాలిక(17) తల్లిదండ్రులతో కలిసి ఓ ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తోంది. ఇదే ఫంక్షన్‌ హాల్‌లో చంపాపేట్‌కు చెందిన నేనావత్‌ శ్రీకాంత్‌ (19) సైతం పని చేస్తున్నాడు. బాలికను పరిచయం చేసుకొని స్నేహంగా మెలిగేవాడు. ఈక్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బాలుడిపై పోక్సో కేసు..
మొయినాబాద్‌: ఇంటి దగ్గర ఒంటరిగా ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బాలుడిపై ఠాణాలో కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నారాయణపేట్‌ జిల్లాకు చెందిన దంతపతులు బతుకుదెరువుకోసం మొయినాబాద్‌కు వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఆరేళ్ల కూతురు ఒకటో తరగతి చదువుతుంది. రెండో శనివారం సెలకు కావడంతో ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలిక పట్ల ఇదే ప్రాంతంలో ఉండే బాలుడు(15) అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బాలున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement