ప్రియురాలితో కలిసి భార్య హత్యకు ప్లాన్‌.. చివరి నిమిషంలో ట్విస్ట్‌

mahabubnagar: Husband Plans To Wife Assassination, But Woman Gives Twist - Sakshi

సాక్షి, జడ్చర్ల టౌన్‌: అగ్ని సాక్షిగా ఒక్కటైన భార్యను.. ప్రియురాలితో కలిసి హత్య చేసేందుకు ఓ భర్త యత్నించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో గురువారం చోటు చేసుకుంది. అయితే తనను హత్యచేస్తారని గ్రహించిన బాధితురాలు స్థానిక పోలీసులు సమాచారం అందించడం.. వారు సకాలంలో స్పందించ టంతో భర్త, ఆయన ప్రియురాలు పరారయ్యారు. ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి అందించిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా.. బాదేపల్లి పట్టణం పాతబజార్‌ కు చెందిన వినోద్‌–అనితకు కొంతకాలం క్రితం వివామైంది. కొన్నాళ్లపాటు అన్యోన్య దాంపత్యం సాగించాక పట్టణంలోనే డిగ్రీ కళాశాల వెనకాల ఉంటున్న కవిత అనే మరో మహిళతో వినోద్‌కు పరిచయమై.. అది కాస్త ప్రేమగా మారింది. దాంతో భార్య అయిన అనితను తప్పించి కవితను పెళ్లిచేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో..

అందుకు సమయం కోసం వేచిచూసి అనితను గురువారం తెల్ల వారుజామున 4గంటలకు కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఈ క్రమంలో వారి కుట్రను గుర్తించిన బాధితురాలు 4.30గంటలకు జడ్చర్ల సీఐ రమేష్‌బాబు కు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న సీఐ స్పందించి ఫోన్‌సిగ్నల్‌ ఆధారంగా ట్రేస్‌ చేసి 44వ నంబరు జాతీయ రహదారిపై బూరెడ్డిపల్లి వద్ద వారిని గుర్తించారు. పోలీసు వాహనాన్ని చూసిన ప్రియుడు– ప్రియురాలు అనితను వదిలేసి పరారయ్యారు. అనిత ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top