ఆ పుస్తకం నన్ను ఎంతగానో కదిలించింది: మంత్రి కేటీఆర్‌ | Ktr On Twitter: I Liked The Gundelo Vaana Book Very Much | Sakshi
Sakshi News home page

ఆ పుస్తకం నన్ను ఎంతగానో కదిలించింది: మంత్రి కేటీఆర్‌

Published Sun, Aug 8 2021 9:51 AM | Last Updated on Sun, Aug 8 2021 10:40 AM

Ktr On Twitter: I Liked The Gundelo Vaana Book Very Much - Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ రాసిన ‘గుండెలో వాన’ తనను కదిలించిందని మంత్రి కె.తారక రామారావు శనివారం ట్వీట్‌ చేశారు. ‘గుండెలో వాన’లోని కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను. మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్లు రాశారు పెద్దింటి అశోక్‌కుమార్‌. రెం డు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు. కంగ్రాట్స్‌ అన్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కథకుడిగా, నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన పెద్దింటి అశోక్‌కుమార్‌ గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటవాసి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సినిమాలకు మాటలు రాస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement