సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు

Published Sun, Jan 7 2024 8:28 AM

 Kidnapped pvt firm employee rescued - Sakshi

హైదరాబాద్: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది.

నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు.

నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు. సురేందర్ కు నిఖిత కజిన్ సిస్టర్ గా గుర్తించామన్నారు. నిఖితతో వెంకటకృష్ణకు పరిచయం ఉందని, వీళ్ళిద్దరూ కలిసి సురేష్ తో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సురేందర్ తో కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేయించారు. వారికి సహకరించాలని చెప్పారని ముందే ప్లాన్ వేశారు.

అయితే.. నిఖిత, వెంకటకృష్ణ లు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.. సురేష్ తో కలిసి నిఖిత , వెంకట కృష్ణలు కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తెలిపారు. గతంలోనూ వీళ్ళు కిడ్నాప్ లు చేసిన కేసులు వున్నాయని తెలిపారు. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. సురేష్, వెంకటకృష్ణ లపై పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై 21 కేసులు ఉండగా, వెంకటకృష్ణ పై రెండు కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. 

Advertisement
 
Advertisement