జూబ్లీహిల్స్ ప‌బ్‌ నిర్వాకం.. కస్టమర్లను ఆకర్షించేందుకు పాములు, తొండ‌లు

Hyderabad: Jubilee Hills Xora Pub Under Scrutiny Exotic Wildlife Display - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా పబ్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది మ్యూజిక్‌, డ్యాన్స్‌, మందు.. వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బులో యూత్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు  కానీ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36లోని ఓ పబ్‌ వినూత్నంగా ఆలోచించింది. ఇవన్నీ రొటీన్‌ అనుకొని ఏకంగా జంతువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాములు, తొండలు, కుక్కలు వంటి వైల్డ్‌ జంతువులను పెట్టి కస్టమర్‌లను ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని క్సోరా (Xora) నైట్ క్లబ్ ఇటీవల తమ పబ్‌లో  విదేశీ వన్యప్రాణులను చేర్చింది. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్సోరా నైట్‌క్లబ్ ఈ వారాంతంలో తమ పబ్‌లో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారని. దీనికి సంబంధించిన ఫోటోలు వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఉన్నాయని, దయచేసి చర్యలు తీసుకోండంటూ ఆశిష్‌ అనే వ్యక్తి పోలీసులను కోరారు.

దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లబ్బుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు సంఘటన అని వర్ణించారు. దీనిని తెలంగాణ డీజీపీ,సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు.

కాగా  నెల క్రితం కూడా సైబరాబాద్‌లోనూ ఇదే రీతిలో పబ్ లో జంతువులను ప్రదర్శనకు పెట్టారు నిర్వాహకులు. పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వహకులు చెబుతున్నారు. అయితే పబ్‌లో జంతువులను ప్రదర్శించడంపై క్సోరా నైట్‌ క్లబ్‌ నిర్వాహకులు స్పందించారు. పబ్‌లో ఉపయోగిస్తున్న ఎక్సోటిక్ అనిమల్స్ లైసెన్స్‌తో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. సదరు జంతువుల వల్ల ఏ హాని ఉండదని పేర్కొంది.
చదవండి: Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top