జూబ్లీహిల్స్ బేబీలాన్‌ పబ్‌లో దారుణం | Hyderabad Jubilee Hills Babylon Pub Influencer Mother And Sister Incident, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జూబ్లీహిల్స్ బేబీలాన్‌ పబ్‌లో దారుణం

May 29 2025 10:00 AM | Updated on May 29 2025 10:44 AM

 Hyderabad Jubilee Hills Babylon Pub Inciden

 లైట్లు ఆర్పి మహిళలపై దాడి 

 జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్‌ పబ్‌లో ఘటన 

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్‌ పబ్‌లో తాము ఆర్డర్‌ చేయని డ్రింక్స్‌కు బిల్‌ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మీనల్‌ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  

సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్‌ మీనల్‌మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్‌ పబ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్‌కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్‌ సిబ్బందిని ప్రశి్నంచింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్‌ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్‌లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా వివరించింది.  తాము ఆర్డర్‌ చేయని డ్రింక్స్‌కు బిల్‌ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.  

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement