
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాపుఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్ముడి విగ్రహం వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. చదవండి: హెడ్‌కానిస్టేబుల్ కూతురుకు అరుదైన గౌరవం