కుమారుడి చికిత్సకు వెళ్లి.. తండ్రి మృతి | Father Dies Of Heart Attack Nalgonda After Son Treatment Nalgonda | Sakshi
Sakshi News home page

కుమారుడి చికిత్సకు వెళ్లి.. తండ్రి మృతి

Dec 23 2021 10:33 AM | Updated on Dec 23 2021 11:01 AM

Father Dies Of Heart Attack Nalgonda After Son Treatment Nalgonda - Sakshi

సాక్షి,చిట్యాల(నల్గొండ): కుమారుడి శస్త్ర చికిత్సకు ఆస్పత్రికి వెళ్లిన తండ్రి హఠాన్మరణం చెందాడు. వివరాలు..చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన ఎంపీపీ కొలను సునిత మరిది ప్రవీణ్‌గౌడ్‌(32) కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అతడి కుమారుడు నీహాల్‌ ఇంట్లో కిందపడడంతో ముఖంపై తీవ్ర గాయమైంది. దీంతో ఆ చిన్నారికి చిన్నపాటి శస్త్ర చికిత్సకు గాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కాగా, బుధవారం ఆస్పత్రిలో ఆ చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉండగా అక్కడికి వెళ్లిన ప్రవీణ్‌గౌడ్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురున్నారు. సంఘటన స్థలానికి నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేరుకుని ప్రవీణ్‌గౌడ్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

చదవండి: చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement