ఎడ్మ కిష్టారెడ్డి మృతికి మంత్రి సంతాపం | Errabelli offer condolence to edma kishtareddy family | Sakshi
Sakshi News home page

ఎడ్మ కిష్టారెడ్డి మృతికి మంత్రి సంతాపం

Aug 18 2020 4:49 PM | Updated on Aug 18 2020 4:54 PM

Errabelli offer condolence to edma kishtareddy family - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ సీనియర్ నేత ఎడ్మ కిష్టారెడ్డి మృతికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నిబద్ధత, నిరాడంబరతకు నిలువెత్తు రూపం ఎడ్మా కిష్టా రెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని తెలిపారు.

రెండుసార్లు కల్వకుర్తి నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన ఎడ్మ కిష్ఠా రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఏ రాజకీయ పక్షంలో ఉన్నా ప్రజాపక్షమే తన తుది ప్రస్థానం అని ఎన్నో సార్లు చెప్పారన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కార్మికులు వలసలు పోకుండా ఉండటానికి అనేక ప్రయత్నాలు చేశారన్నారు. ఎడ్మ కిష్టారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఎర్రబెల్లి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement