భద్రాద్రి, సాక్షి: భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో ఈ రోజు (ఆదివారం) భూప్రకంపనలు వచ్చాయి. అర్థరాత్రి 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెను వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్షర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. అయితే ఈ భూకంప తీవ్రత వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.


