దేశంలోనే మా ఆడిటింగ్‌ నెంబర్‌వన్‌ | Deputy CM Bhatti meets with senior officials of Gujarat Audit Department | Sakshi
Sakshi News home page

దేశంలోనే మా ఆడిటింగ్‌ నెంబర్‌వన్‌

Apr 8 2026 12:23 AM | Updated on Apr 8 2026 12:23 AM

Deputy CM Bhatti meets with senior officials of Gujarat Audit Department

గుజరాత్‌ ఆడిట్‌ శాఖ ఉన్నతాధికారులతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో అ త్యుత్తమ ప్రమాణాల తో తెలంగాణ ఆడిట్‌ శాఖ దేశంలోనే నెంబర్‌ వ న్‌గా నిలిచిందని, వరు సగా మూడు సార్లు మొదటి ర్యాంకు సాధించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభు త్వ వ్యవస్థలు బలంగా పనిచేస్తున్నా యని చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ వ్యవస్థను పరిశీలించేందుకు రెండు రోజుల కిందట వచ్చిన గుజరాత్‌ ఆడిట్‌ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలో భట్టితో భేటీ అయింది. 

ఈ సందర్భంగా వారికి సాదర స్వాగతం పలికిన భట్టి.. ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ అధ్యయనానికి అవస రమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని తెలిపారు. గుజరాత్‌ అధికా రులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ను అధ్యయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్‌ విధానం పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతోందని కితాబి చ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆడిట్‌ శాఖ డైరెక్టర్‌ నరసింహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement