దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్‌ | Cm Revanth Speech At The World Telugu Federation Conference | Sakshi
Sakshi News home page

దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్‌

Jan 5 2025 9:23 PM | Updated on Jan 5 2025 9:24 PM

Cm Revanth Speech At The World Telugu Federation Conference

దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ సమయంలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను మన తెలుగువాళ్లే తయారు చేశారన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ మహాసభ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. ఏ దేశానికి వెళ్లిన మన తెలుగు వారు కనిపిస్తారన్నారు.

మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్‌ సూచించారు.

పరభాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement