
హైదరాబాద్: ఒకవైపు నగరంలో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్న వేళ.. సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న పళంగా ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా ట్యాంక్ బండ్‌కు వచ్చారు. పూర్తిస్థాయి భద్రత లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు సీఎం రేవంత్.
అసలు నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా వచ్చి పరిశీలించారు. అక్కడకు వచ్చిన భక్తులతో సీఎం రేవంత్ మాట్లాడారు. గణేష్ నిమజ్జనంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయో అని అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్.