సాక్షి,హైదరాబాద్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. బీమా కృష్ణా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకోగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి లకు జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి వీక్షించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన ఇరిగేషన్ అధికారులు.


