హైదరాబాద్‌ రెహమత్‌నగర్‌లో విషాదం.. రేకుల రూమ్‌పై గోడకూలి నెలల పసికందు మృతి

A child died after a wall collapsed in Rahmat Nagar Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన నిర్మాణంలో ఉ‍న్న ఓ బిల్డింగ్‌ గోడ కూలి.. పక్కనే ఉన్న రేకుల ఇంటి మీద ఇటుక రాళ్లు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఓ నెలల పసికందు మృతి చెందింది.  

నారాయణఖేడ్ చెందిన శ్రీకాంత్-జగదేవి జంట.. కూలీ పని కోసం నగరానికి వచ్చి రెహమత్‌నగర్‌ పరిధిలోని ఓంనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షంతో.. వాళ్లుంటున్న పోర్షన్‌ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం నాలుగో అంతస్తులో ఉన్న సైడ్‌వాల్‌ కూలిపోయింది. దీంతో ఆ ఇటుక రాళ్లు పక్కనే శ్రీకాంత్‌ ఉంటున్న రేకుల రూమ్‌పై పడ్డాయి. 

ఆ సమయంలో పెద్ద శబ్ధం రావడంతో.. ఆ భార్యభర్తలిద్దరూ అప్రమత్తం అయ్యి బయటపడ్డారు. అయితే ఊయలలో నిద్రిస్తున్న 8 నెలల జీవనికా ఇటుకలు మీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతితో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ భవన నిర్మాణం అక్రమంగా సాగుతోందని చెబుతూ.. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి.. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top