మిషన్‌ భగీరథ బోగస్‌ ప్రాజెక్టు.. దీనికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటు

Center Awards For Bogus Projects Alleges YS Sharmila - Sakshi

జోగిపేట (ఆంధోల్‌): మిషన్‌ భగీరథ బోగస్‌ ప్రాజెక్టు అని, ఈ పథకానికి కేంద్రం అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాజెక్టును రూ.40 వేల కోట్లతో చేపట్టగా పెద్దమొత్తంలో కమీషన్లు తిన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌కు ఎందుకు అవార్డులిస్తోందని ఆమె ప్రశ్నించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల సంక్షేమ నిధి ఏమైందని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికిరణ్‌ ఏనాడూ ప్రశ్నించలేదని షర్మిల విమర్శించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఈ ఎమ్మెల్యే నోరు మెదపలేదని మండిపడ్డారు. ఆయన చంటి క్రాంతికిరణ్‌ కాదని, కంత్రీ కిరణ్‌ అని షరి్మల ఎద్దేవాచేశారు.
చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్‌–రేవంత్‌ల మాటల యుద్ధం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top