మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత | BRS Leader Harish Rao Suffering With High Fever Admitted Hospital | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత

Jun 16 2025 8:40 PM | Updated on Jun 16 2025 9:47 PM

BRS Leader Harish Rao Suffering With High Fever Admitted Hospital

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(జూన్‌ 16) సాయంత్రం సమయంలో తెలంగాణ భవన్‌లో హరీష్‌ రావు అస్వస్థతకు లోనయ్యారు.  

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆచ్‌.. ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నిర్విహించిన సమావేశంలో హరీష్‌రావు స్వల్పపాటి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను అక్కడ నుంచి బేగంపేట కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. హై ఫీవర్‌తో హరీష్‌రావు ఆస్పత్రిలో చేరారు.

వైరల్ ఫీవర్, డి ఐడ్రేషన్‌తో బాధ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు.సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో  హరీష్‌రావును జాయిన్‌ చేయగా, ఆయన్ను కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement