‘దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు’ | BJP Chief Ramchander Rao Demands 33 Percentage Reservation for Women | Sakshi
Sakshi News home page

‘దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు’

Mar 24 2026 7:04 PM | Updated on Mar 24 2026 7:23 PM

BJP Chief Ramchander Rao Demands 33 Percentage Reservation for Women

హైదరాబాద్‌: డిలిమిటేషన్‌లో మహిళా రిజర్వేషన్‌ అనేది 33 శాతంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. జనగణన అనంతరం డిలిమిటేషన్‌ జరుగుతుందన్నారు. జనాభా , ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదని, ఒకవేళ అలా జరిగితే నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల సీట్లు పెరగవన్నారు రాంచందర్‌రావు. 

‘ఇక్కడ 8 వేలు ,10 వేలు జనాభా ఉన్న సీట్లు ఉన్నాయి.  జనాభా ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని కాంగ్రెస్ చేసే ఆరోపణలో నిజం లేదు. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా లోక్ సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగదు. ఉత్తరాదికి పెరిగిన ప్రపోషన్ ఆధారంగా దక్షిణాదిన సీట్లు పెరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ లు మతం మార్పిడి చేస్తే రిజర్వేషన్ వర్తించదనే కేసులో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 

ప్రలోభాలకు గురి చేసి మతం మార్చుకుంటున్నారు. మత మార్పిడిల వల్ల ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం జరుగుతుంది. ఈ జడ్జిమెంట్ తో ఎస్సీ ఎస్టీ లకు అందాల్సిన సరైన ఫలాలు అందుతాయి’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement