 
													ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది
ముస్లిం అనే ఏకైక కారణంతో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది
మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహ్మద్ అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం మైనారిటీ అనే ఏకైక కా రణంతో అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దంటూ బీజేపీ కొర్రీలు పెడుతుందని ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన మీడియా స మావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్ని కలో గెలిచే అవకాశం లేదని బీజేపీకి తెలుసని... అందుకే బీఆర్‌ఎస్‌కు లాభం చేసేందుకు కుట్రలకు తెరతీసిందని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తెరవెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత బట్టబయలు చేసిందని ఆయన గుర్తుచేశారు.
గతంలో బీఆర్‌ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ ఎస్‌కు లాభం చేకూర్చేందుకు ఆలస్యంగా బలహీనౖ మెన అభ్యర్థిని బీజేపీ ప్రకటించిందని భట్టి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు లాభం కలిగించేందుకే అజహ రుద్దీన్‌ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. అజహరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసిందని... అయితే గవర్నర్ అలాంటి వ్యక్తి కాదనే నమ్మకం తనకుందని భట్టి అన్నారు. కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు.
రాజస్తాన్‌లో ఉపఎన్నిక వేళ మంత్రి పదవి ఎలా ఇచ్చారు?
గతంలో రాజస్తాన్‌లోని శ్రీకరణ్‌పూర్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్‌ను బీజేపీ మంత్రివర్గంలోకి తీసుకుందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఉపఎన్నికకు కేవలం 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నా రని.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శన మని భట్టి విమర్శించారు. మైనారిటీ అనే ద్వేషంతోనే అజహరుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజపీ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను మైనారిటీలు అర్థం చేసుకో వాలని.. ఉపఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజక వర్గం వరకేనని, అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి కాదన్నారు. మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో జరగడంలేదన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతమని భట్టి స్పష్టం చేశారు. అందులో భాగంగానే అజహరుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాలపై నిబద్ధత ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొంథా తుపానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమైందని.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు యావత్ కేబినెట్, సీఎస్, అధికార యంత్రాంగమంతా 24 గంటలూ పనిచేసి కావాల్సిన చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగినట్లు భట్టి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
