రూ.1.25 కోట్లు పలికిన గణేశ్‌ లడ్డు | Bandlaguda Ganesh Laddu auction fetched highest Rs1 crore 25 Lakhs | Sakshi
Sakshi News home page

రూ.1.25 కోట్లు పలికిన గణేశ్‌ లడ్డు

Sep 29 2023 2:00 AM | Updated on Sep 29 2023 4:42 PM

Bandlaguda Ganesh Laddu auction fetched highest Rs1 crore 25 Lakhs - Sakshi

బాలాపూర్‌ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్‌

బండ్లగూడ(హైదరాబాద్‌): వేలం పాటలో గణేశ్‌ లడ్డుకు అత్యధికంగా రూ.1.25 కోట్లు పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్‌ పరిధిలోని సన్‌సిటీ రిచ్‌మండ్‌ విల్లాలోని గణనాథుడి లడ్డుకు గురువారం వేలంపాట నిర్వహించగా, ఆర్‌వీ దియా చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు రూ. 1.25 కోట్లకు దక్కించుకున్నారు. ఆర్‌వీ దియా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 150కిపైగా వ్యక్తిగతదాతలు కలిసి ఈ లడ్డును కొనుగోలు చేశారు. గతేడాది ఇక్కడి లడ్డు కు వేలంపాటలో పలికిన ధర రూ.6.28 లక్షలే.  

బాలాపూర్‌ లడ్డు రూ. 27 లక్షలు 
బాలాపూర్‌ గణనాథుని లడ్డును ఈసారి తుర్క యాంజాల్‌ పరిధిలోని పాటిగూడ గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, రైతు దాసరి దయానంద్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు ఆయన సొంతమైంది.  

► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చ బండ వినాయక లడ్డును వేలం పాటలో రూ.22. 11 లక్షలకు కేటీఆర్‌ గ్రూప్‌ సభ్యులు దక్కించుకున్నారు. గతేడాది  రూ.20.20 లక్షలు పలికింది.  
► బడంగ్‌పేట వీరాంజనేయ భక్త సమాజం లడ్డును మాజీ ఉప సర్పంచ్‌ పెద్దబావి వెంకట్‌రెడ్డి రూ.17 లక్షలకు సొంతం చేసుకున్నారు.  
► షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని మధురపురం రెడ్డిసేవా సమితి వినాయక లడ్డును అదే గ్రామానికి చెందిన శేరి పర్వతరెడ్డి రూ. 11,11,116లకు దక్కించుకున్నాడు 

బాలాపూర్‌ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్‌  

లడ్లు దక్కించుకున్న ముస్లింలు  
► ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కుమార్‌జనతా గణేశ్‌మండలి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించగా, స్థానిక ముస్లిం యువకుడు షేక్‌ ఆసిఫ్‌ రూ.1.02లక్షలకు దక్కించుకున్నాడు.  
► రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పరిధిలోని సాయినగర్‌ కాలనీలో లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన మహారాజ్‌పేట్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం తాహేర్‌ అలీ రూ. 23,100కు దక్కించుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement