సీపీ టు డీజీపీ.. 36 ఏళ్లలో పని చేసిన 21 మంది 

Anjani Kumar is new DGP of Telangana - Sakshi

వీరిలో 13 మందికి నగర కొత్వాల్‌ అనుభవం 

కొందరు నేరుగా... మరికొందరు ఏసీబీ నుంచి 

ఆ జాబితాలో చేరిన ఇన్‌చార్జి డీజీపీ అంజనీ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ).. రాష్ట్ర పోలీసు విభాగానికి బాస్‌.. యూనిఫాం ధరించిన ప్రతి ఐపీఎస్‌ అధికారి కనే కల.. ఇలాంటి కీలకమైన పోస్టులో నియమితులైన వారిలో అత్యధికులకు సిటీతో ‘అనుబంధం’ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత డీజీపీలుగా నియమితులైన వారిలో ఎక్కువ మంది సిటీ పోలీసు కమిషనర్‌గా పని చేసిన వారే. ఈ పరంపరకు కొనసాగింపుగా గురువారం అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీ నియమితులయ్యారు.  

కొత్వాల్‌ కూడా ‘డ్రీమే’... 
పోలీసు విభాగానికి సంబంధించి కేవలం డీజీపీ పోస్టు మాత్రమే కాదు మరో రెండు ‘డ్రీమ్‌ పోస్టులు’ కూడా ఉన్నాయి. నిత్యం ఈ పోస్టులకు భారీ పోటీ ఉంటుంది. అందులో ఒకటి నిఘా విభాగం అధిపతి కాగా... మరొకటి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌. ప్రత్యేక చట్టం, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధికారాలతో పాటు రాష్ట్రానికే గుండెకాయ వంటి సిటీకి నేతృత్వం వహించడం దీనికి కారణం. ఇటీవల జిల్లాల విభజన జరిగిన తర్వాత సిటీకి అనుబంధంగా ఉంటే సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకూ పోటీ పెరిగింది. ఈ పోస్టు కోసం ఐజీ స్థాయి అధికారుల్లో తీవ్రమైన పోటీ ఉంటోంది.

చదవండి: (Telangana: వందే భారత్‌ ఎప్పుడొచ్చేనో!.. రైలు ప్రత్యేకతలివీ..)

36 ఏళ్లలో13 మంది... 
1986 నుంచి ఇప్పటి వరకు అటు ఉమ్మడి రాష్ట్రం, ఇటు విభజన తర్వాత అంజనీకుమార్‌తో కలిపి మొత్తం 21 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు డీజీపీలు/ఇన్‌చార్జి డీజీపీలు అయ్యారు. వీరిలో 13 మందికి నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అనురాగ్‌ శర్మ, మహేందర్‌రెడ్డి నేరుగా ‘సిటీ కమిషనరేట్‌’ నుంచి ‘డీజీపీ కార్యాలయానికి’ వెళ్లగా... మిగిలిన వారిలో అత్యధికులు ‘వయా’ చేరుకున్నారు. ఏకే మహంతి రోడ్‌ సేఫ్టీ అథారిటీ నుంచి, అరవిందరావు, ప్రసాదరావు తదితర అధికారులు అవినీతి నిరోధక శాఖకు చీఫ్‌లుగా పని చేస్తూ డీజీపీలుగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంజనీకుమార్‌ కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ/ఇన్‌చార్జి డీజీపీలుగా నియమితులైన ముగ్గురూ సిటీ కమిషనర్లుగా పని చేసిన వారే. 

సీపీ టు డీజీపీలు వీరే: సీజీ సల్దాన్హ, ఆర్‌.ప్రభాకర్‌రావు, టి.సూర్యనారాయణరావు, ఎంవీ భాస్కర్‌రావు, హెచ్‌జే దొర, ఎస్‌ఆర్‌ సుకుమార, పేర్వారం రాములు, వి.దినే‹Ùరెడ్డి, ఏకే మహంతి, బి.ప్రసాదరావు, అనురాగ్‌శర్మ, ఎం.మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్‌. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top