గ్రామీణ యువత కోసం ఏర్పాటు: డిప్యూటీ సీఎం భట్టి
వచ్చే ఏడాది నుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ విద్యారంగం
మధిర: తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖలో ప్రణాళి కలు రూపొందించి ముందుకు సాగుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధి రలో మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పట్టణాలకు వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రాల్లోనే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్లలో మెటీరియల్‌తోపాటు డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రం, దేశంలో నిష్ణాతులైన అధ్యాపకులతో ఆన్‌లైన్ బోధన ఉంటుందని చెప్పారు. తొలి విడతగా ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో వీటిని ప్రారంభించేలా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు.
శరవేగంగా నిర్మాణం
విద్యావ్యవస్థలో గేమ్ చేంజర్‌గా నిలిచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తామని, ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని భట్టి తెలిపారు. విద్యార్థులు పోషకాహార లోపంతో ఇబ్బంది పడొద్దనే భావనతో సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించాలని నిర్ణయించగా, ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరమైన వసతులు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. అంతేకాక ప్రతీ మండలంలో పదేసి గ్రామాలకు ఒకటి చొప్పునమూడు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి దశలవారీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సీఎస్‌ఆర్ నిధుల ద్వారా స్థానికంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నికోలస్, ఇంటర్మీడియెట్ విద్య కార్యదర్శి ఆదిత్య భాస్కర్, ఈడబ్ల్యూఎస్ ఐడీ ఎండీ గణపతిరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్‌కు రెండు ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు
మధిర: అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు ఐ ఎస్‌ఓ సర్టిఫికెట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌కు దక్కా యి. ఖమ్మం జిల్లా మధిరలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరైన ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ఈ సర్టిఫికెట్లను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డికి అందజేశారు. విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్‌స్టేషన్ల నిర్వహణ, నిర్మాణాల్లో అత్యుత్తమ నాణ్యతకు గుర్తింపుగా ఐఎస్‌ఓ 9001:2015 క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ దక్కిందని భట్టి తెలిపారు.
అలాగే, ఉద్యోగుల భద్రతకు తీసుకుంటున్న సురక్షా ప్రమాణా లను గుర్తిస్తూ ఐఎస్‌ఓ 45001:2018 ఆక్యుపే షనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సర్టిఫికె ట్ జారీ అయిందన్నారు. ఈ సర్టిఫికెట్లను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జారీ చేయగా, తెలంగాణలో మొదటిసారి ఎన్పీడీసీఎల్ సంస్థకు దక్కడం విద్యుత్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని భట్టి తెలిపారు.


