హైదరాబాద్: ఓ ఎయిర్ హోస్టెస్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన జాహ్నవి గుప్తా (28) ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తూ రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి కెన్‌ఫుడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచి్చన ఆమె రాత్రి తన గదిలో ఉరి వేసుకుపి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం ఆమె సెల్‌ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు జమ్మూ కాశ్మీర్ లో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అపార్ట్‌మెంట్‌వాసుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా జాహ్నవి గుప్తా ఉరికి వేలాడుతూ కనిపించింది. పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.


