శ్రావణి కేసు: కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ | Sakshi
Sakshi News home page

శ్రావణి కేసు: దేవరాజ్‌తో ఉండొద్దని వారు వేధించారు

Published Mon, Sep 14 2020 4:29 PM

Accused In Sravani Suicide Case Were Introduced Before Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో నిందితులైన దేవరాజ్‌, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. శ్రావణి 2012లో టీవీల్లో పనిచేయాలని హైదరాబాద్‌కి వచ్చింది. 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిర్మాత అశోక్‌ రెడ్డి పరిచయం అయ్యారు. 2019లో దేవరాజ్‌ రెడ్డి పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురూ కూడా శ్రావణిని పెళ్లి చేసుకుంటామని వేధించారు. అదే క్రమంలో దేవరాజ్‌తో దూరంగా ఉండలాని సాయికృష్ణ పలు సందర్భాల్లో శ్రావణితో గొడవ పడ్డాడు. (శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్‌100 నిర్మాత)

దేవరాజ్‌తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లి తండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని వేధించారు. శ్రావణిని సాయి, ఆమె తల్లిదండ్రులు కొట్టారని దేవరాజ్‌ చెప్పాడు. అనేక సార్లు సాయి తన దగ్గర ఉన్న ఫోటోలతో శ్రావణిని బెదిరించాడు. అయితే దేవరాజ్‌ కూడా పెళ్లి చేసుకుంటనని చెప్పి మోసం చేసాడు. అంతకుముందే దేవరాజ్‌పై శ్రావణి కేస్ పెట్టింది. కాగా శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలు ఉండటంతో దేవరాజ్‌ పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఏ1గా సాయి కృష్ణారెడ్డి, ఏ2 అశోక్‌ రెడ్డి, ఏ3 దేవరాజ్‌ రెడ్డిలుగా గుర్తించాం. వీరిలో ఇప్పటికే దేవరాజ్‌ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేశాం. ఆర్‌ఎక్స్‌-100 నిర్మాత అశోక్‌ రెడ్డి పరారీలో ఉన్నారు. అతనిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది' అని డీసీపీ తెలిపారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్‌ అరెస్ట్‌)

Advertisement
Advertisement