
శివ్వంపేట(నర్సాపూర్): ప్రేమ విఫలమైందని ఓ యువతి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన యువతి సక్కుబాయి(21) ఎంబీఏ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణఖేడ్‌కు చెందిన సుధాకర్ అలియాస్ సిద్దును ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను చెప్పింది. కుటుంబ సభ్యులు గోత్రాలు పరిశీలించగా.. వరుసకు అన్నా చెల్లెలు అవుతారని మందలించారు.
ఆ తర్వాత పది రోజుల క్రితం ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పగా.. మళ్లీ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి ఈ నెల 1న ఇంట్లో పురుగుల మందు తాగింది. తొలుత నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి బహుదూర్‌పల్లిలోని ఎస్‌వీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. మృతిరాలు తండ్రి కేశ్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు.