వేలం చిట్టీల పేరిట 41.27 లక్షలు మోసం | - | Sakshi
Sakshi News home page

వేలం చిట్టీల పేరిట 41.27 లక్షలు మోసం

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

తిరువళ్లూరు: వేలం చీట్టిల పేరిట పలువురి వద్ద 41.27 లక్షల రూపాయలను మోసం చేసిన వ్యవహరంలో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు మరోకరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌ పొన్నియమ్మన్‌మేడు ప్రాంతానికి చెందిన ధనం(30). ఈమే ముగప్పేర్‌లోని ఎక్స్‌పోర్టు కంపెనీలో పని చేస్తూ వుంది. ఇదే కంపెనీలో ముగప్పేర్‌ రెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన ఆదికేశవన్‌ కుమారుడు మురుగన్‌(42) వాహనాలను అద్దెకు తోలుతున్నాడు. ఈ క్రమంలోనే ఽమురుగన్‌కు ధనంతో పరిచయం ఏర్పడింది. తాను దీపావళీ పండ్‌, వేలం చీట్టిలను నిర్వహిస్తున్నానని, 25 మందితో దీపావళీ పండ్‌ చీట్టిలో సభ్యులుగా చేర్చితే ఒక పండ్‌ ఫ్రీగా ఇస్తానని నమ్మించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వేలం చీట్టిలో సభ్యులను చేర్చితే కమిషన్‌ ఇస్తామని నమ్మించాడు. వీటిని నమ్మి ధనం, ఆమే భర్త వసంత్‌కుమార్‌లు సుమారు 41 లక్షల మేరకు చీట్టిలు, దీపావళి పండ్‌లు వేసినట్టు తెలుస్తుంది. అయితే చీట్టిలు పాడిన వారికి సరిగ్గా నగదు ఇవ్వడంతో ధనంతో పాటు మోసపోయిన బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో మురుగన్‌తో పాటు అతడి భార్య భువనేశ్వరి తదితర ఇద్దరూ కలిసి వేలం చీట్టిలు, దీపావళీ పండ్‌ల పేరిట నగదును వసూలు చేసి పలువురిని మోసం చేసినట్టు గుర్తించిన పోలీసులు మురుగన్‌ను అరెస్టు చేసి కోర్టులో హారుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement